Site icon NTV Telugu

Harish Rao : గాంధీ ని తిట్టిన వారు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు

Harish Rao

Harish Rao

Minister Harish Rao Fired on Union Minister Kishan Reddy

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సారి స్వంతత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. అయితే.. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం అజాద్‌ కి అమృత్‌ మహోత్సవం పేరిటి ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహం పేరిట ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అయితే.. ఈ క్రమంలోనే తాజాగా.. సిద్దిపేటలో 75 వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.

జాతీయ జెండాలను ఇవ్వలేము కాగితాలు అతికించుకోండి అంటున్నారని, జాతీయ జెండాలను ఇవ్వలేని పరిస్థితి లో మనం ఉన్నామా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మాటలు అవమానకరంగా ఉన్నాయన్నారు హరీష్‌ రావు. జెండాలు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఇవ్వాళ కొందరు గాంధీని తిట్టి, గాడ్సేను పొడుగుతున్నారని ఆయన మండిపడ్డారు.   గాంధీ ని తిట్టిన వారు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారని, దేశ ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.

 

Exit mobile version