Minister Harish Rao Exclusive Interview: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.. అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి.. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది అధికార బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు అధికార పార్టీ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులు ప్రచారంలో జోరు చూపిస్తున్నారు.. తనదైన శైలిలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరిస్తున్నారు.. ఎవరు అధికారంలోకి వస్తే.. ఏ ప్రమాదం జరుగుతుందో కూడా హెచ్చరిస్తున్నారు.. ఎన్నికల రణరంగంలో బిజీగా ఉన్న మంత్రి హరీశ్‌రావు.. ఇప్పుడు ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు.. ఎన్టీవీ ప్రతినిధులు సంధిస్తోన్న ప్రశ్నలకు.. మంత్రి హరీశ్‌రావు ఇస్తోన్న సమాధానాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..