తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షం లో బీఆర్ఎస్ పార్టీలో మాజీ కాంగ్రెస్ నేత సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ శిరీష చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అభ్యర్థులను అమ్ముకుంటున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముతుంది అని ఆయన ఆరోపించారు. దృఢమైన నాయకత్వం కావాలా.. బలహీన నాయకత్వం కావాలా? ప్రజలు తేల్చుకోవాలి అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Arjun Sarja: గ్రాండ్ గా అర్జున్ కుమార్తె నిశ్చితార్థం..
ఇక్కడ కేసీఆర్ ఉన్నారు? అక్కడ ఎవరు ఉన్నారు? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ దే హాట్రిక్ అంటూ మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ ది అభివృద్ది ఎజెండా కాంగ్రెస్ ది బూతుల ఎజెండా.. బీజేపీ ఎంపీ సన్ని డియల్, సుపర్ స్టార్ రజినీ కాంత్ లకు హైదరాబాద్ అభివృద్ధి కనిపిస్తోంది.. కానీ ఇక్కడ గజినీలకు మాత్రం కనపడడం లేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపొతే ఏపీలో అమరావతి లాగా అవుతుందని హైద్రాబాద్ లో వ్యాపారులు అనుకుంటున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ డక్ అవుట్.. కాంగ్రెస్ రన్ అవుట్.. కేసీఆర్ సెంచరీ చేస్తాడని ఆయన పేర్కొన్నారు.