Harish Rao : మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ నెల 3న మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగగా.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. అయితే.. ఇంకా 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉండగానే దాదాపు తమ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Also Read :Dia Mirza: హీరోయిన్ బాత్ రూమ్ వీడియో నెట్టింట లీక్.. నాగ్ బ్యూటీ ఏమన్నదంటే..?
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అగ్రనేతలు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని ఆయన ట్విట్ చేశారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు సైతం తమ పార్టీ అభ్యర్థిని గెలుపుకోసం పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతుం 14వ రౌండ్ ఓట్ల లెక్కింపు జరగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యత ప్రదర్శించనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు.