Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Gummanur Jayaram Who Went Into Hiding After Ysrcp List

Minister Gummanur Jayaram: అజ్ఞాతంలో మంత్రి గుమ్మనూరు జయరాం.. విషయం అదేనా..?

Published Date :January 20, 2024 , 11:15 am
By Sudhakar Ravula
Minister Gummanur Jayaram: అజ్ఞాతంలో మంత్రి గుమ్మనూరు జయరాం.. విషయం అదేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Gummanur Jayaram: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్పులు, చేర్పులు.. కొన్ని ప్రాంతాల్లో వివాదాలకు దారి తీశాయి.. పోటీ చేసే స్థానాలు మారిపోవడంతో.. తాజా అభ్యర్థులకు సరైన సహకారం ఉన్నట్టుగా కనిపించడంలేదు.. మరికొన్ని చోట్ల మాత్రం కొత్త ఉత్సాహంతో నేతలు దూసుకుపోతున్నారు. అయితే, ఇదే సమయంలో.. వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా.. ఆయన అందుబాటులోకి రావడం లేదట.. అసలు మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం ఏమై ఉంటుంది? ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వొచ్చు కదా? అంటున్నారట వైసీపీ పెద్దలు.

అయితే, ఆలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం.. ఆయన్ని కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామం జరిగిన తర్వాత 4 రోజులు బెంగుళూరులో ఉన్న జయరాం.. ఆ తర్వాత ఆలూరులో మూడు రోజులు గడిపారు. ఇదే సమయంలో ఆలూరు వైసీపీ తాజా అభ్యర్థి విరుపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదట. ఇక, నిన్న ఆలూరు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట మంత్రి జయరాం.. ఎంపీగా పోటీ చేసే విషయంపై మాట్లాడేందుకు వైసీపీ ముఖ్య నేతల ప్రయత్నం చేసినా ఆయన దొరకడం లేదట.. అయితే, ఆలూరు స్థానాన్ని వదులుకోవడానికి మంత్రి జయరాం సుముఖంగా లేరని ఆయన అనుచరులు చెబుతున్నమాట.. ఇదే సమయంలో.. ఎమ్మెల్యే స్థానం నుంచి కాకుండా.. ఈ సారి ఎంపీగా పోటీ చేసేందుకు కూడా ఆయనకు ఇష్టం లేదనే ప్రచారం సాగుతోంది.. అందుకే ఆయన ఎవరీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది.

కాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇంఛార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా విడుదల చేసిన మూడో జాబితాలో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.. అయితే, ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జయరాం అంటున్నారు. తనకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట.. ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది.. మరి, మంత్రి గుమ్మనూరు జయరాం మనసులో ఏముంది.. లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగుతారా? అనే విషయం వేచిచూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alur
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Kurnool
  • Minister Gummanur Jayaram

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions