Minister Amarnath: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిట్టింగ్ స్ధానమైన అనకాపల్లి వీడి వెళ్లాల్సి వస్తుందన్నందుకు కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటామని ఆయన అన్నారు. మంత్రి కంట కన్నీళ్ళు వచ్చే సరికి సమావేశంలో కొంత సేపు గంభీర వాతావరణం కనిపించింది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్‌కు.. మంత్రి వర్గ విస్తరణలో కీలక పోర్టు ఫోలియో లభించింది.
Read Also: Chandrababu: కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ చేసిన జగన్ కామెంట్లపై చంద్రబాబు కౌంటర్
వైనాట్ 175 అంటున్న వైసీపీ అభ్యర్థుల మార్పులో భాగంగా అనకాపల్లి బరిలోకి కొత్త నాయకత్వాన్ని తెచ్చింది. మలసాల భరత్‌ను నూతన ఇంఛార్జ్‌గా నియమించింది. నిన్న విడుదలైన రెండో జాబితాలో మంత్రిని మార్చేసిన అధిష్టానం అమర్నాథ్‌కు ఎటువంటి బాధ్యతలు అప్పగించేది ప్రకటించలేదు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీకి దూరమై కార్యకర్తగా జెండాపట్టుకుని తిరిగి వైసీపీ విజయానికి కృషి చేస్తానంటున్నారు అమర్నాథ్.