NTV Telugu Site icon

Gudivada Amarnath: 2009లో వచ్చిన ఫలితాలే.. 2024లో రిపీట్ అవుతాయి!

Gudivada Amarnath

Gudivada Amarnath

Minister Gudivada Amarnath Says YCP Comes to Power in AP: పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే.. ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పోలింగ్ శాతం 81.86గా నమోదైందని ఈసీ ప్రకటించింది. 2014లో 78.90శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 79.80శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి 1.5శాతం వరకు పెరిగింది. రికార్డు పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అని టీడీపీ అంటోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

Also Read: Narayana Swamy: ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం

‘పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు. 2009లో మహాకూటమి వైఎస్సార్ మీద పోరాటం చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగింది. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయి. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలని ఉద్దేశంతోనే జనం పోటెత్తి ఓటేశారు. గతంలో వచ్చిన దానికంటే ఒక్క సీటైనా ఎక్కువ వస్తుందని మా విశ్వాసం. గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారు. ఏకపక్షంగా విజయం సాధిస్తాం. వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరం అవుతుంది’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.