NTV Telugu Site icon

Gudivada Amarnath: హరిరామ జోగయ్యపై మంత్రి అమర్నాథ్ ఫైర్.. సీనియర్ ప్యాకేజీ స్టార్..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: వైసీపీ, మాజీ మంత్రి హరిరామ జోగయ్యపై లేఖల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇక, హరిరామ జోగయ్యపై మంత్రి అమర్నాథ్ ఫైర్‌ అయ్యాడు.. జోగయ్య సీనియర్ ప్యాకేజ్ స్టార్, నమ్మక ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు.. మాట్లాడలేని, కనీసం పెన్ను పట్టుకోలేని వయసులో ఆయన రాతలు జుగుప్స కలిగిస్తున్నాయన్న ఆయన.. జోగయ్య భూమికి భారం.. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకుని సంతకం పెట్టి లేఖలు విడుదల చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పీఆర్పీ నుంచి బయటకు వచ్చి చిరంజీవి వ్యక్తిత్వాన్ని కించపరిచిన నైజం జోగయ్యది అని దుయ్యబట్టారు. చిరంజీవి సీట్లు అమ్ముకున్నారని మాట్లాడిన జోగయ్య ను పవన్ కల్యాణ్‌ సమర్థిస్తారా..? సమాధానం చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. రేపు పవన్ కల్యాణ్‌, చంద్రబాబుకు ఇదే పరిస్థితి జోగయ్య ద్వారా ఎదురుకావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Read Also: Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ సహకారం.. పోర్చుగల్‌లో కొత్త స్థావరం..

మరోవైపు హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. “మా నాన్న గారితో మీకున్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ గుర్నాథరావు గారి కొడుకుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు ఇలాంటి ఉత్తరం రాస్తున్నందుకు బాధగానే ఉన్నా, మీరు ఎంత స్థాయికి దిగజారిపోయారో, మీరే సమాజంలో నిరూపించుకున్న తర్వాత, ఇక నాబోటి వారికి మీకు సమాధానం చెప్పక తప్పటం లేదు. ఏ మనిషికైనా వయసు పెరిగేకొద్దీ సంస్కారం పెరుగుతుందని అంటారు. మీకు మాత్రం పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోంది. కాబట్టే, ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలి మీరు కూడా స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీపడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని విమర్శించారు.

Read Also: PM Modi Tour: 7,8 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

ఇక, జోగయ్య గారూ.. సన్సేషన్ కావటం కోసం అడ్డమైన వాగుడు వాగి, టీవీలకు, పత్రికలకు, సోషల్ మీడియాకు అందులో కూడా ప్రత్యేకించి ఎల్లో మీడియాకు మీరు మేత అందించాలనుకుంటున్నారు. మీ దిగజారుడుతనం పగవాడికి కూడా వద్దు. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి..?. పవన్ పుట్టిందే బాబు కోసం. పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలో. పవన్ కు నిర్మాతలంతా బాబు మనుషులే. మరి మీరు కూడా మరో ప్యాకేజి స్టార్ కావడానికి వీలుగా బాబుని, బాబు మీడియాని, బాబు వర్గాన్ని సంతోషపరచడానికి ఈ చీప్ టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారని భావించాలా..? అని నిలదాశారు.. ఎంతో గొప్ప రాజకీయ జీవితాన్ని అనుభవించిన మీ పట్ల వ్యక్తిగతంగా మాకు ఏ రకమైన శతృత్వంగానీ, వ్యతిరేకతగానీ లేదు. కానీ, మీ రాతలు, మీ భావాలు, మీ దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయని, మీ పద్ధతి బాగుందో, లేదో, కనీసం మీ పిల్లల్ని, మీ శ్రేయోభిలాషులను కనుక్కుని మీరు విచక్షణతో, విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Show comments