NTV Telugu Site icon

Gudivada Amarnath: మంత్రి అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోడీ క్లారిటీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారు..!

Gudivada

Gudivada

Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమ విధానం స్పష్టమన్న ఆయన.. అసలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ విధానం ఏంటో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. అనకాపల్లి బహిరంగ సభలోనే ప్రధాని మోడీ.. ఈ ప్రకటన చేస్తేనే జనం.. ఎన్డీఏ (బీజేపీ-టీడీపీ-జనసేన)కూటమిని విశ్వసిస్తారని తెలిపారు.. అంతే కానీ, వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతలు ప్రస్తుతం చెబుతున్న నోటి మాటలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరని పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

Read Also: Sunita Kejriwal: ఎలక్షన్ టైంలో కేజ్రీవాల్‌ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు..

మరోవైపు.. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ప్రజల చేత.. .ప్రజల కోసం లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేస్తాను అంటున్నారు.. ప్రజల భాగస్వామ్యంతో గాజువాక అవసరాలను గుర్తించి లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు.. వందలాది మంది అభిప్రాయాలను సేకరించి హామీ పత్రం రెడీ చేస్తున్నారు మంత్రి గుడివాడ.. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ హామీ పత్రాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు.. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు స్థానిక సమస్యలపై హామీ పత్రం సిద్ధం చేస్తున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

Show comments