NTV Telugu Site icon

Gudivada Amarnath: వచ్చే వైఎస్సార్ జయంతి నాటికి.. జగన్‌ రెండోసారి సీఎం కావాలి..

Amarnath

Amarnath

Gudivada Amarnath: వచ్చే ఏడాది వైఎస్సార్ జయంతి నాటికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నం పెందుర్తిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వైస్సాఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మేనిఫెస్టోలో ఒక్కటైన సొంత ఆలోచన ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ ప్రకటించారు. 175 సీట్లను ఎలా గెలవాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే.. 175 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల కోసం చంద్రబాబు ఇతర పార్టీలతో సంప్రదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జగన్ కు చంద్రబాబుకు మధ్య నక్కకి నాగలోకానీకి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు అమర్నాథ్. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు కాగా.. మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎంపీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.. దివ్యాంగులకు బ్యాటరీ బైక్ లు పంపిణీ చేశారు వైవీ సుబ్బారెడ్డి.

Read Also: Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

ఇక, పెందుర్తి సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు హామీలు ఇవ్వడం ఒక ఫ్యాషన్.. వాటిని ఎన్నడూ అమలు చేయరు అని విమర్శించారు. చంద్రబాబు రక్తంలో హామీలు అమలు అనే మాట లేదు.. మోసం చేసి అధికారంలోకి రావడమే ధ్యేయం అని ఆరోపించారు. టీడీపీ, జనసేన మోసపూరిత హామీలను నమ్మొద్దు అని సూచించారు. పెందుర్తి ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ను,ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏపీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్న వైవీ.. ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రైతుల ఆత్మహత్యలను అడ్డుకున్న మహా నేత వైఎస్సార్ అని గుర్తుచేశారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వైఎస్సార్ ముందు చూపుతోనే సాధ్యం అయ్యిందన్న ఆయన.. వైజాగ్ ఎయిర్ పోర్టును 100 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ ది అన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు నిర్మాణం వేగంగా జరుగుతోందని వెల్లడించారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.