NTV Telugu Site icon

Gudivada Amarnath: బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు.. మంత్రి అమర్నాథ్ అసహనం

Gudivada Amarnath

Gudivada Amarnath

ఏపీ ప్రభుత్వం ఇమేజ్ ని డామేజ్ చేసి.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు మీద పారిశ్రామిక వర్గాల్లో విస్త్రతమైన చర్చ జరుగుతోంది….ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చూసి తట్టుకోలేని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పారిశ్రామిక రాయితీలు ఆలస్యం అయ్యాయి….ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..రాయితీల విడుద
లపై వస్తున్న నెగెటివ్ కథనాల వెనుక అసలు ఉద్దేశం ప్రభుత్వ పాలనపై తప్పుడు సంకేతాలు పంపించాలనే దురుద్దేశం ఉందని విమర్శించారు.

పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదు., ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా చూడాలనే దురుద్దేశం దాగి ఉంది. ప్రెస్ మీట్ లో ఓ పత్రిక ను చించివేసి అసహనం వెళ్లగక్కారు మంత్రి అమర్నాథ్. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్న పత్రిక ప్రమాదకరమైంది.,టిష్యు పేపర్ గా మాత్రమే పనికి వస్తుంది. ఆదానీ గ్రూప్ తో రెన్యువబుల్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాలు కొనసాగుతాయన్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం అన్నారు. ఒప్పందాలను అమలు చేసే సామర్ధ్యం ఉంటే ఆదాని పెట్టుబడులు కొనసాగుతాయన్నారు.

Read Also: UPI LITE Payments: రూ.200 లోపు చెల్లింపులకు యూపీఐ లైట్‌ని ఇలా వాడాలి

రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఉత్పన్నమయ్యే అవకాశం లేదన్నారు. పారిశ్రామిక వేత్తలకు స్పష్టమైన హామీ ఇచ్చాం. విశాఖలో విప్రో కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వెయ్యి మంది ఉద్యోగులతో కేంపస్ ప్రారంభించేందుకు విప్రో ఆసక్తి ప్రదర్శించింది. ఐటీ,స్టార్టప్స్ కోసం 3లక్షల ఎస్.ఎఫ్.టి తో భవనం నిర్మాణం చేపడతాం. త్వరలోనే ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటిస్తాం అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read Also: Preeti Health Bulletin: డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల.. నిమ్స్‌ వైద్యులు ఏం చెప్పారంటే