Site icon NTV Telugu

Rs.1 Lakh aid for BCs : బీసీలకు లక్ష సాయం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి గంగుల

Gangula Kamala Kar

Gangula Kamala Kar

వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నేల 6నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లాంఛనంగా లబ్ధిదారులకు సాయం అందించడంతోపాటు అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలతో పథకాన్ని ప్రారంభించారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఈనెల 6న ప్రారంభించారు.

Also Read : Bhatti Vikramarka : బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉంది..

దీంతో.. వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఈ లక్షసాయంపై మంత్రి గంగుల అధ్యక్షతన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి గంగలు కమలాకర్‌ మాట్లాడుతూ.. బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. ప్రతీ నెల 15వ తేదీన పథకం గ్రౌండింగ్, ఆన్లైన్లోనే అప్లికేషన్, ఏ ఆఫీసుకు వెల్లాల్సిన, ఎవరినీ కలువాల్సిన అవసరం లేదన్నారు. పనిముట్లు, సరుకుల కొనుగోళ్లపై కులవృత్తుల్లోని చేతివృత్తుదారులకే నిర్ణయాధికారమని ఆయన వెల్లడించారు. గ్రౌండింగ్ అయిన నెలలోపు లబ్దిదారుల ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారన్నారు.

Also Read : Adipurush: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు… రికార్డులు ఏమైనా మిగిలాయా?

Exit mobile version