మహాబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర్ మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిజన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. శ్రీరాముని అంత గొప్పవాడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సేవాలాల్ మహరాజ్ ఆదర్శ పురుషుడని, సేవాలాల్ త్యాగాలు ప్రతీ తండాకు వ్యాపింఛజేసిన గిరిజన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. 26వ తేదీన పాలకుర్తిలో ఎకరం స్థలంలో రెండు కోట్ల రూపాయలతో భవన్ కు శంకుస్థాపన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : MLA G Sayanna : ఎమ్మెల్యే సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం
మహారాష్ట్ర, కర్ణాటక నుండి వేద పండితులు వస్తున్నారని, బంజారాలు న్యాయంగా, పద్దతిగా జీవించే వ్యక్తులు అని, గిరిజన తండాలను అభివృద్ధి చేసిన మహానుభావుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మాతండాలో మారాజ్యం అనే నినాదాన్ని సాకారం చేసింది కేసీఆర్ అని, గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వట్లేదని ఆయన వెల్లడించారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ఇప్పటికి కేంద్రం ఇవ్వలేదని, హైదరాబాద్‌లో 100కోట్లతో సేవాలాల్ భవనం నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలిసిన బాధ్యత గిరిజనులదని ఆయన అన్నారు.
Also Read : Elon Musk: ప్రపంచాన్ని ఇంటర్నెట్ ఏలుతుంది.. 25 ఏళ్ల క్రితమే మస్క్ అంచనా.. పాత వీడియో వైరల్..
