NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుంది..

Errabelli

Errabelli

Errabelli Dayakar Rao: హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని.. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుందన్నారు. ఆడపిల్ల పెళ్లికి మేనమామగా లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. మేనమామగా సీఎం కేసీఆర్‌ను ఆదరించాలని ఎర్రబెల్లి పేర్కొ్న్నారు. కర్ణాటకలో పెన్షన్ 500 వస్తుందన్న మంత్రి.. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా రావట్లేదన్నారు. తెలంగాణలోనే ప్రతి కుటుంబానికి 2000 పింఛన్‌ను కేసీఆర్ ఇస్తున్నారన్నారు.

Read Also: Revanth reddy: ఏ శాఖలో ఎన్నిఖాళీలున్నాయో 24గంటల్లోగా చెప్పు బండి సంజయ్

నిన్న ఢిల్లీలో కేంద్రమంత్రులు తెలంగాణ పథకాలను పొగిడారన్న మంత్రి.. సిగ్గు లేకుండా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇయ్యనివారు కూడా ధర్నాలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టైతే నేను దేనీకైనా సిధ్ధమంటూ మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణలో ఇంకా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏమీ చేయట్లేదని, ప్రజలు ఆలోచించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.