Site icon NTV Telugu

Errabelli Dayakar Rao : దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలి

Errabelli Dayakar

Errabelli Dayakar

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల ప్రాజెక్ట్ పనుల పురోగతి పైన సంబంధిత అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ హనుమకొండ కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలని ఆధికారులకు సూచించారు.

Also Read : Tammineni Sitaram: చంద్రబాబు వెంటిలేటర్ మీద ఉన్న రాజకీయనేత
పనులు వేగంగా జరగకపోతే ఇబ్బంది అవుతుందని, త్వరలో దీనిపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తారన్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయి. గతంలో కాంట్రాక్టర్ చేయకపోతే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్ళి రీ టెండర్ పెట్టించినా అనుకున్నంత ముందుకు పోవడం లేదన్నారు. మీరు లోపాలు సరి దిద్దుకుని వేసవి కాలంలో పు పూర్తి అయ్యేలా పని చెలని విజ్ఞప్తి చేశారు. 6 నెలలలో పూర్తి చేస్తామని హామీ ఇస్తే మూడేళ్లు అవుతున్నా కావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వద్ద దీని మీద రివ్యూ చేస్తారని, అక్కడ రివ్యూ అయ్యేలోపు అన్ని చేయాలన్నారు. మీరు సీరియస్‌గా తీసుకోకపోతే ఇబ్బంది అవుతుందన్న ఎర్రబెల్లి.. అందరూ సమన్వయం చేసుకుని పనులు వేగంగా చేయాలని సూచించారు.
Also Read : Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు

Exit mobile version