Prakasam: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం..

  • మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం
  • పాలేటిపాడులో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి
  • తిరుణాల సందర్భంగా టిడిపి నాయకులు కొనుగోలు చేసిన..
  • నూతన ఎడ్ల బండిని ప్రారంభిస్తుండగా డీజే సౌండ్లకు బెదిరి మంత్రిని ఢీకొన్న ఎద్దులు
  • కింద పడిపోయిన మంత్రి స్వామి.. స్వల్ప గాయాలు
Dola

Dola

ప్రకాశం జిల్లాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి.. తిరుణాల సందర్భంగా టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన నూతన ఎడ్ల బండిని ప్రారంభిస్తుండగా డీజే సౌండ్లకు బెదిరి ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి.

Read Also: pimples: ఈ రకం చేపలు తింటే మొటిమలు మాయం..!

ఈ క్రమంలో మంత్రి స్వామి కింద పడిపోయాడు.. దీంతో.. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే.. స్థానిక నాయకులు అప్రమత్తమై తప్పించడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. అనంతరం యధావిధిగా పోలేరమ్మ తిరునాళ్ళలో పూజా కార్యక్రమాలు ముగించుకొని స్వగ్రామమైన నాయుడు పాలెం గ్రామానికి వెళ్లిపోయారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.

Read Also: PM MODI: కేంద్ర పథకాలను అమలు చేయాల్సిందే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ టాస్క్