pimples: ఈ రకం చేపలు తింటే మొటిమలు మాయం..!
- మొటిమలతో బాధపడుతున్న చాలా మంది యువత
- ఎన్నిమందులు వాడినా..తగ్గని పరిస్థితి
- తాజా మొటిమల నివారణకు రుచికరమైన చిట్కాచెప్పిన నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యువత మొటిమలతో బాధపడుతోంది. చాలా మందికి వయసు పెరిగే కొద్ది మొటిమలు ఎక్కువవుతున్నాయి. వాటి నివారణకు మార్కెట్లో దొరికే ఆయింటిమెంట్స్, మందులను వాడుతుంటారు. ఎన్ని వాడినా.. అవి వాడినన్ని రోజులు మాత్రమే మొటిమలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. ఆ ఆయింటిమెంట్స్ మానేసిన తర్వాత మళ్లీ మొదటికే వస్తుంది. మొటిమల నివారణకు ఓ ఆరోగ్యకరమైన, రుచికరమైన చిట్కాను చెప్పారు.. నిపుణుల. చేపలకు సంబంధించి మరో ఆరోగ్య ప్రయోజనం బయటపెట్టారు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్ వంటి చేపలు మొటిమలు త్వరగా తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. స్వల్పంగా, ఒక మాదిరిగా మొటిమలు గలవారిని పరిశోధకులు విశ్లేషించగా వీరిలో 98% మందిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు తేలింది.
READ MORE: PM MODI: కేంద్ర పథకాలను అమలు చేయాల్సిందే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ టాస్క్
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ఈ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే మధ్యధరా ప్రాంత ఆహారం, మాత్రలను ఇవ్వగా వారికి మంచి ఫలితం కనిపించటం విశేషం. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఒంట్లో వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్) తగ్గిస్తాయి. చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇవి వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నిరోధించటం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ కొందరు నిపుణులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతరులతో పోల్చకపోవటం వల్ల మొటిమలు తగ్గటమనేది ఆహారం, పాల పదార్థాలు తగ్గించటం, ఒమేగా 3 మాత్రలు, ఇతర పద్ధతుల్లో ఏవి ప్రభావం చూపిస్తున్నాయో తెలియటం లేదంటున్నారు. అయినా కూడా పండ్లు, కూరగాయలు, నిండు ధాన్యాల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే మాట నిజం. చర్మ ఆరోగ్యానికివి బాగా ఉపయోగపడతాయి. చేపలు, గింజ పప్పుల్లో వాపును నిలువరించే గుణం ఉండటం గమనార్హం. ఇవి దురద, మొటిమల వంటి చర్మ సమస్యలు తగ్గటానికి దోహదం చేస్తాయి. ఆలివ్ నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..