Site icon NTV Telugu

Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్‌.. పగటి కలలు మానుకో..!

Dola Bala Veeranjaneya Swam

Dola Bala Veeranjaneya Swam

Minister Dola Bala Veera Anjaneya Swamy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. విజయసాయిరెడ్డి డర్టీ పొలిటిక్స్ చేస్తున్నారని, రాజకీయంగా ముగిసిపోయిన వ్యక్తిని మళ్లీ ఎందుకు బతికిస్తారని ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి డోలా.. విజయసాయిరెడ్డి తన చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని మర్చిపోయారా అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయనను బయటకు పంపించారని, అలాంటి వ్యక్తి మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతాడని ప్రశ్నించారు.

Read Also: Panama Canal: హార్మూజ్‌ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్‌పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..

విజయసాయిరెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని మంత్రి డోలా సూచించారు. రాజకీయ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై స్పందిస్తూ, ఆయన గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని అన్నారు. దళిత ఎమ్మెల్యేలు మనోవేదనతో మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలతో తాను స్వయంగా మాట్లాడానని, కొన్ని సర్వేల నివేదికల ఆధారంగా మాత్రమే వారు మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..

Exit mobile version