Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dola Bala Veera Anjaneya Swamy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. విజయసాయిరెడ్డి డర్టీ పొలిటిక్స్ చేస్తున్నారని, రాజకీయంగా ముగిసిపోయిన వ్యక్తిని మళ్లీ ఎందుకు బతికిస్తారని ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి డోలా.. విజయసాయిరెడ్డి తన చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని మర్చిపోయారా అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయనను బయటకు పంపించారని, అలాంటి వ్యక్తి మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతాడని ప్రశ్నించారు.
Also Read
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
విజయసాయిరెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలని మంత్రి డోలా సూచించారు. రాజకీయ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై స్పందిస్తూ, ఆయన గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని అన్నారు. దళిత ఎమ్మెల్యేలు మనోవేదనతో మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలతో తాను స్వయంగా మాట్లాడానని, కొన్ని సర్వేల నివేదికల ఆధారంగా మాత్రమే వారు మనస్తాపానికి గురయ్యారని తెలిపారు. ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!