ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు.
Also Read: CM Chandrababu: రామ్మూర్తినాయుడి కర్మక్రియలు.. హాజరైన సీఎం చంద్రబాబు!
ఈరోజు ప్రకాశం జిల్లాలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచింది. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. గత ఐదేళ్లు చాలా దారుణాలు చేశారు. ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయి. తప్పు చేసినవాళ్లు ఎవరైనా తప్పించుకోలేరు. అందుకు నిదర్శనం విజయ్ పాల్ అరెస్టే. సెకీతో విద్యుత్ ఒప్పొందాలపై అప్పటి విద్యుత్ శాఖ మంత్రి స్పందించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు’ అని మంత్రి డోలా పేర్కొన్నారు.