Site icon NTV Telugu

Bala Veeranjaneya Swamy: ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం.. ఎలాంటి బదిలీలు ఉండవు!

Dola

Dola

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించే పరిస్థితి లేదని, పని భారం విభజన జరుగుతోంది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవని, రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తి అయ్యాకే అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామన్నారు. రేషనలైజేషన్‌ వల్ల పని భారం తగ్గుతుందని, సచివాలయాల సంఖ్య పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు సచివాలయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులతో సమావేశం నిర్వహించారు.

Also Read: Nambala Keshava Rao: బీటెక్ టు నక్సలిజం.. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే!

‘గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఉద్యోగ సంఘ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించే పరిస్థితి లేదు. పని భారం విభజన జరుగుతోంది. కేటగిరి ఏలో పంచాయితీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. మహిళా పోలీస్ మరో కేటగిరిలో ఉంటారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని పోస్టులు ఉంటాయి. ఒక సచివాలయానికి 7 లేదా 8 పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు. జిల్లా స్థాయిలో ఒక అధికారి, మండల స్థాయిలో మరో అధికారి, సచివాలయ ఉద్యోగులను మానిటరింగ్ చేస్తారు. ప్లానింగ్ బోర్డ్ కూడా ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు.

Exit mobile version