Site icon NTV Telugu

Dola Veeranajaneya Swamy: ప్రశాంత వాతావరణంలో పులివెందుల ఎన్నికలు.. వైసీపీది తప్పుడు ప్రచారం..!

Dola Bala Veeranjaneya Swam

Dola Bala Veeranjaneya Swam

Dola Veeranajaneya Swamy: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అరెస్ట్‌లు, అక్కడి పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదుట ఆందోళనకు దిగింది వైసీపీ అయితే.. ప్రశాంత వాతావరణంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.. వైసీపీది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు మంత్రి డోల వీరాంజనేయస్వామి.. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ హక్కుల్ని కాపాడుకుంటూ ప్రజలకి భద్రత కల్పిస్తున్నారు.. వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు.. ఈ రోజు దాదాపుగా 100 కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు..

Read Also: Raj Gopal Reddy: మేమిద్దరం అన్నదమ్ములమని అప్పుడు తెలియదా?.. మరోసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్!

ఇక, 154 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయినా వైసీపీకి బుద్ది రావడం లేదని మండిపడ్డారు డోల వీరాంజనేయస్వామి.. ఈ రోజు పులివెందులలో కూడా వాళ్ల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు… ఓటమిని జీర్ణించుకోలేక రిగ్గింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. ఇప్పటికే 35 శాతం ఓటింగ్ జరిగిందని తెలిపారు వాళ్ల ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటున్నారు.. మరి మా ఎమ్మెల్సీ ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా.. ? అని ప్రశ్నించారు.. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది.. వారికి లాగా మేం ధర్నాలు గొడవలు చేయడం లేదన్నారు.. ప్రస్తుతానికి ఎన్నికలు ప్రశాంతంగా నడుస్తున్నాయి.కూటమి ప్రభుత్వం కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. వైసీపీ నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు.. చట్టాన్ని గౌరవించాలి. ఏకపక్షంగా రాజకీయం చేయడం ఎవరు ఉపేక్షించరని స్పష్టం చేశారు మంత్రి డోల వీరాంజనేయస్వామి..

Exit mobile version