NTV Telugu Site icon

Dharmana Prasada Rao: టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు..

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: టీడీపీ, చంద్రబాబు మేనిపెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలుపరచి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించలేదన్నారు. 2014 నుంచి 2019 కాదు , చంద్రబాబు 14 ఏండ్ల సీఎంగా ఎప్పుడూ మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు. చంద్రబాబుకి క్రెడిబులిటీ లేదని , 10 శాతం కూడా అమలు చేయరని మంత్రి ధర్మాన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల కోసం ఒక గమ్మత్తు చేయాలనుకుంటారని.. సూపర్ సిక్స్‌ను జనం నమ్మడం లేదన్నారు.

Read Also: CM YS Jagan: జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా?

సీఎం జగన్ నూటికి నూరుపాళ్లు మేనిఫెస్టోను అమలు చేశారని మంత్రి తెలిపారు. వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలు ఆసక్తిగా చర్చిస్తున్నారన్నారు. మేనిఫెస్టోపై వైసీపీ ఒక విశ్వాసం కలిగించిందని అన్నారు. వైసీపీ అమలు చేసిన పథకాలు ఫీడ్‌బ్యాక్ ప్రకారం కొనసాగిస్తున్నామన్నారు.పథకాల అమలులో నిబద్దత ఉంది కనుకనే సాధ్యాసాద్యాలపై దృష్టి పెట్టామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను చిత్తుకాగితంగా భావిస్తారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు పథకాలు ప్రకటించారని ఆరోపించారు. మేనిఫెస్టో అనేది వైసీపీకే ఉందన్నారు. టీడీపీ వాళ్లు 600 ప్రకటిస్తారు , తరువాత ఏం అమలు చేయరని మంత్రి అన్నారు.