NTV Telugu Site icon

Dharmana Prasada Rao: రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది.. ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది.. సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్ళు అయినా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడే ఉన్నాయన్నారు.. గత ప్రభుత్వాలు ఈ పరిస్థితిని సరిదిద్దలేక పోయాయన్న ఆయన.. వైఎస్‌ జగన్ ప్రభుత్వమే ధైర్యంగా అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారు.. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: YSRCP MLCs: కొత్తగా ఎన్నికైన 8 మంది వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..

బటన్ నొక్కి పథకాలు అందిస్తున్నారు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యంగంగా మాట్లాడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు మంత్రి ధర్మాన.. నేను ప్రశ్నిస్తున్నాను.. ఇన్నేళ్ళు అయినా 21 శాతం మంది అక్షరం ముక్క రాని వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? అని నిలదీశారు.. ఇది పాలనలోని లోపం కాదా? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇదే ప్రయత్నం 50 ఏళ్ల కిందటే చేసి ఉంటే.. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో రకంగా ఉండేదని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.