Site icon NTV Telugu

Dharmana Prasada Rao: యాక్టింగ్‌ కాదు.. నిజ జీవితం గొప్ప.. వాలంటీర్లను విమర్శించాడంటేనే స్థాయి తెలిసిపోయింది..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఓవైపు వాలంటీర్లు, మరోవైపు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పవన్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పరోక్షంగా జనసేనానిని టార్గెట్‌ చేశారు.. రాత్రి అనక , పగలనక వాలంటీర్లుగా పని చేసిన వారిని విమర్శిస్తున్నారు అంటూ మండిపడ్డారు.. బాధ్యత లేక వారు వాలంటీర్లపై మాట్లాడుతున్నారు.. ఎవరో బ్రోకర్ వెదవ అన్నాడని, పనికి మాలినోడి మాటల్ని పట్టించుకోవద్దు అని సూచించారు.

Read Also: Siddu Jonnalagadda: టిల్లు గాడు.. చిరంజీవినే రిజెక్ట్ చేశాడా.. ?

సమాజంలో వేస్ట్ టికెట్లు, చీడ పురుగులు తిరుగుతూ ఉంటారు.. మంచి పని చేసేవారికి పోరంబోకులు తగులుతుంటారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. నిన్నో పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.. వారికేటి తెలిదు అంటూ ఎద్దేవా చేశారు.. నాలుగు గోడల మధ్య సినిమాలు తీసేవాడు గొప్పగా ఫీలవుతూ ఉంటారు.. యాక్షన్‌లు చేయడం గొప్పకాదు.. నిజ జీవితం గొప్ప అని హితబోధచేశారు. ఓ వాలంటీర్లు విమర్శిస్తే ఆయన స్థాయి ఏంటో మనకి అర్థం అవుతుంది అంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.. అలాంటి వారిని విమర్శించడం నా స్థాయికి తగదు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Exit mobile version