Minister Dharmana Prasada Rao: ఈ సారి నేను పోటీ చేయాలా..? వద్దా..? చెయ్యి ఎత్తి చెప్పండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dharmana Prasada Rao: వచ్చే ఎన్నికల్లో నన్ను పోటీ చేయమంటారా? వద్దా..? మీరు చెప్పినట్టే చేస్తాను.. చేతులు ఎత్తి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని కోరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో పాత్రునివలస, పెద్దపాడు ప్రజలకు మంచినీటిని అందించడానికి రూ.24 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. అక్కడికి వచ్చిన ప్రజలకు ఓ ప్రశ్న వేశారు.. ఈ సారి నేను పోటీ చేయాలా ? వద్దా? మీరు వద్దు అంటే పోటీ మానేస్తాను అంటూ ప్రజల్ని ప్రశ్నించారు మంత్రి ధర్మాన.. అంతేకాదు.. నేను పోటీ చేయొద్దు అనేవాళ్లు చెయ్యి ఎత్తాలని సభికులను కోరారు.. దీంతో, మీరు పోటీ చేయాలని ప్రజలు కోరారు.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం.. తలకు గాయాలు..
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఇక, ఓటు వేసిన తరువాత అయ్యోరామ అంటే కుదరదు.. మీరు అంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన.. ఇప్పుడు టీడీపీ దొంగలు మీ ఇళ్లకు వస్తున్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు.. నమ్మొద్దని కోరారు. మరి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు.. ఇదంతా డ్రామా.. ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరో ఏదో చెప్పింది వినకండి.. ఎవరికి ఓటు వేయాలో మేం చెప్పాలా..? అని ప్రశ్నించారు. అన్నీ జగనే ఇస్తా ఉన్నరంటున్న ముసలామే జగన్ కే ఓటు అన్నారు.. గుర్తు అడిగితే సైకిల్ అంటుంది.. మన గుర్తు ఫ్యాన్ గుర్తుగా అందరికీ చెప్పండి అని కోరారు.. మరోవైపు.. వాలంటీర్లను తీసేద్దామా ? ఉంచుదామా..? అని ప్రశ్నించారు.. వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా మీకు పనిచేస్తుందని గుర్తుచేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!