NTV Telugu Site icon

Minister Dharmana Prasada Rao: ఈ సారి నేను పోటీ చేయాలా..? వద్దా..? చెయ్యి ఎత్తి చెప్పండి..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Minister Dharmana Prasada Rao: వచ్చే ఎన్నికల్లో నన్ను పోటీ చేయమంటారా? వద్దా..? మీరు చెప్పినట్టే చేస్తాను.. చేతులు ఎత్తి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని కోరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో పాత్రునివలస, పెద్దపాడు ప్రజలకు మంచినీటిని అందించడానికి రూ.24 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. అక్కడికి వచ్చిన ప్రజలకు ఓ ప్రశ్న వేశారు.. ఈ సారి నేను పోటీ చేయాలా ? వద్దా? మీరు వద్దు అంటే పోటీ మానేస్తాను అంటూ ప్రజల్ని ప్రశ్నించారు మంత్రి ధర్మాన.. అంతేకాదు.. నేను పోటీ చేయొద్దు అనేవాళ్లు చెయ్యి ఎత్తాలని సభికులను కోరారు.. దీంతో, మీరు పోటీ చేయాలని ప్రజలు కోరారు.

Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం.. తలకు గాయాలు..

ఇక, ఓటు వేసిన తరువాత అయ్యోరామ అంటే కుదరదు.. మీరు అంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన.. ఇప్పుడు టీడీపీ దొంగలు మీ ఇళ్లకు వస్తున్నారు. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు.. నమ్మొద్దని కోరారు. మరి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు.. ఇదంతా డ్రామా.. ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరో ఏదో చెప్పింది వినకండి.. ఎవరికి ఓటు వేయాలో మేం చెప్పాలా..? అని ప్రశ్నించారు. అన్నీ జగనే ఇస్తా ఉన్నరంటున్న ముసలామే జగన్ కే ఓటు అన్నారు.. గుర్తు అడిగితే సైకిల్ అంటుంది.. మన గుర్తు ఫ్యాన్‌ గుర్తుగా అందరికీ చెప్పండి అని కోరారు.. మరోవైపు.. వాలంటీర్లను తీసేద్దామా ? ఉంచుదామా..? అని ప్రశ్నించారు.. వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా మీకు పనిచేస్తుందని గుర్తుచేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.