వైసీపీని పడగొట్టాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. YCPకి ఓటు వేయొద్దని మహిళలకు చెప్పేవారుoటారు మీ ఇంట్లోని మగవారు కూడా. ఎందుకంటే వాళ్ల చేతుల్లోకి వెళ్లాల్సిన చాలా వాటిని మీ చేతుల్లోకి మార్చాము. ఆ కోపం వాళ్ళకి ఉంది…. ఈ పార్టీని పడగొట్టాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్లు పార్టీని పడగొడితే మొట్టమొదట తగిలే గుండు ఆడవాళ్ళకే. శత్రువు నీ ఇంట్లోనే ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా వారిని నిలువరించాలి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయడం అంటే మీ చేతుల్ని మీరు నరుక్కోవడమే అన్నారు మంత్రి ధర్మాన.
Read Also: Pawan Kalyan: ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్
ధర్మాన ప్రసాదరావుని ఓడించిస్తే ఏమైపోతుంది. నేను పోటీ చేస్తానో, లేదో ఆరోజు పరిస్థితిని బట్టి చూద్దాం. కానీ మీకు సహాయం చేసిన పార్టీని,నాయకుడినీ మీరు ఓడిoచేస్తే మహిళలకు ఏమి చేసినా వేస్ట్ అని అనరా…?మగవారు కొంతమంది పోరంబోకుల్లా తయారయ్యారని బాధ్యతలు లేని వారిని ఉద్దేశించి అన్నాను. నేను అలా అంటే చాలామంది పోరంబోకులకి కోపం వచ్చింది. కోపం వచ్చిన పోరంబోకులకి ఒక నమస్కారం. పోరంబోకు అని ఎవడైనా ఒప్పుకుంటే వాడికో నమస్కారం అన్నారు మంత్రి ధర్మాన ప్రసదరావు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
Read Also: Pawan Kalyan: ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్