ఈమధ్యకాలంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మగవాళ్ళంతా పోరంబోకులు అనీ, అందుకే మహిళల పేరు మీద అన్ని పథకాలు జగన్ అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మరోమారు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, మహిళా రుణాల విషయమై చంద్రబాబు మాట తప్పాడన్నారు. మేం అధికారంలొకి వచ్చాక పాతరుణాలను కూడా తీర్చాం. పథకాల వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రజలు గమనించి గుర్తించాలి. ఇంటి ఇల్లాలికి ఆర్థిక ఆసరా దక్కే విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి.
Read Also:Top Headlines @5PM: టాప్ న్యూస్
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇస్తారో, మాట తప్పి, హామీలు నీరుగార్చే దొంగ అయిన చంద్రబాబుకి ఇస్తారో మీ ఇష్టం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశలు అన్నీ మహిళలపైనే. మళ్లీ ఆయనకు అధికారం దక్కించే అధికారం మీ చేతిలోనే ఉంది. మీరు ఈ సారి మేలు చేసే వారికి చేయూత ఇచ్చే వారికి కన్న కొడుకులా చూసుకునే వారికి అధికారం ఇస్తారో ఇవ్వరో ఆలోచించుకోవాలి. జగన్ కు ఓటు వేసి అదికారం ఇవ్వకపోతే మహిళలే నష్టపోతారు. ఓటు వేసేటప్పుడు మనసు చెప్పిన మాట ప్రకారం వేయాలి. మీకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వానికి మరో సారి అధికారం ఇవ్వాలని గుర్తు పెట్టుకొని ఓటు వేయండి అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Hyderabad: ఆన్‌లైన్ సెహ్రీ, ఇఫ్తార్ ఆర్డర్‌లలో రికార్డు