NTV Telugu Site icon

Dharmana Prasada Rao: ప్రజలు ఇంటెలిజెంట్‌గా వ్యవహరించాలి.. డబ్బు ఇస్తే తీసుకోండి..

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Minister Dharmana Prasada Rao: ఎన్నికలు ముందు చెప్పే మాటలు అధికారంలోకి రావడం కోసం కాదని, గెలిచాక ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. కనీస సౌకర్యాలకు నోచుకోని వారికి ఉపశమనం కలిగించే పనులు చేశారన్నారు. రూ.2 లక్షల అరవై వేల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందజేశామన్నారు. ఎవ్వరి వద్దా తలవంచకుండా పథకాలు ఇచ్చి కొత్త ఒరవడిని సృష్టించామన్నారు.

Read Also: Pithapuram: జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొర బాబు భేటీ.. ఆ విషయంలో అంగీకారం

ఎవడు ఎస్సీ కులంలో పుడతాడని చంద్రబాబు అన్నాడని.. ఎస్సీల పట్ల ఆయన భావన బయట పడింది కదా అంటూ విమర్శించారు. అలాంటి వారికి అధికారం ఇచ్చి నెత్తిన పెట్టుకుంటామా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ఏపీలో తిరుగులేని శక్తిగా ఉందన్నారు. అందుకే ఎన్నికల వేల అన్ని పార్టీలు ఓ వైపుకు వెళ్లిపోయారు.. కానీ ప్రజలు మరో వైపుకు వెళ్లారన్నారు. వార్డుల్లో వెతికినా టీడీపీ ఓట్లు దొరకవన్నారు. ఎన్నికలు వచ్చినప్పడు డబ్బులు ఖర్ఛుపెట్టి రాజ్యాధికారం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇంటిలిజెంట్‌గా వ్యవహరించాలని.. డబ్బు ఇస్తే తీసుకోవాలని, ఆశపెట్టినవన్నీ తీసుకోవాలని, కానీ అభివృద్ధికే ఓటు వేయాలని ఆయన సూచించారు.