Site icon NTV Telugu

Dharmana Prasada Rao: అందుకే అవినీతి నిర్మూలనపై ఫోకస్‌ చేశాం..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: అవినీతి అనేది ఒక అవమానకరమైన స్థితి.. అవినీతి ఉంటే పాలనకు మంచి పేరు రాదు.. అందుకే అవినీతి నిర్మూలనపై ఎక్కువ దృష్టి పెట్టాం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఏలూరు దెందులూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చిందని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగి, అవినీతిలేని పాలన అందడంతో ప్రజలు సంతృప్తి చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక స్థాయి వరకు అవినీతి తొలగించాము.. మరిన్ని విధానాలు అవలంభించి పూర్తి స్థాయిలో ఎక్కడా అవినీతి కనిపించకుండా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.. అవినీతి అనేది ఒక అవమానకరమైన స్థితన్న మంత్రి.. అవినీతి ఉంటే పాలనకు మంచి పేరు రాదు.. అందుకే అవినీతి నిర్మూలనపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. రెండేళ్లు కరోనాలో గడిచిపోయిన ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పరిపాలన అందించాం.. దేశం అంతా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని చూస్తోంది.. ఒక వ్యక్తి వాలంటీర్స్ ని అవమానిస్తే రాష్ట్రమంతా ఆందోళనలు వెల్లువెత్తాయంటూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత వాలంటీర్లు ఆందోళనకు దిగిన సందర్భాన్ని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Read Also: IPL Auction 2024: ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. ఆ ముగ్గురిలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవరు?

Exit mobile version