Dharmana Prasada Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా రంగంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి.. దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డే అన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగనన్న సురక్ష ద్వారా ప్రభుత్వం ఉచితంగా 11 రకాల సేవలు ఒక్క నయాపైసా తీసికోకుండా అందిస్తుందన్నారు. జిల్లాలో ఇంత వరకు 3.33 లక్షల కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను.. 773 సచివాలయాల ద్వారా అందజేశామని తెలిపారు. పరిపాలనలో ఒక వినూత్నమైన తరహా ఆలోచన ఇది అని.. పేదలకు అండగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు అని ప్రశంసలు కురిపించారు. నిస్సహాయలకు, నిరుపేదలకు జగనన్న సురక్ష ఒక శ్రీరామ రక్షగా అభివర్ణించారు. జగనన్న సురక్ష పకడ్బందీగా అమలు చేయడం వల్ల గణనీయంగా ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Botsa Satyanarayana: ఏపీ అప్పులు సరే.. విభజన హామీల సంగతేంటి..?