Site icon NTV Telugu

ICC Womens U-19: చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ.. మంత్రి అభినందనలు

Raja Narasimha

Raja Narasimha

అంతర్జాతీయ మహిళల అండర్-19 క్రికెట్ కప్‌ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి, చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. త్రిష సాధించిన సెంచరీ.. క్రీడల్లో రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. పిల్లల్లో ఉన్న క్రీడాసక్తిని, కల్చరల్ స్కిల్స్‌ను గుర్తించి.. వారు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మెరిసేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, గురువులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు.. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటినీ నెలకొల్పుతున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

Read Also: Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?

అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఈరోజు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది. త్రిష టీ20 అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. తెలంగాణలోని భద్రాచలంకు చెందిన త్రిష.. 53 బంతుల్లో సెంచరీ సాధించింది. మొత్తం 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది.

Read Also: Hanmakonda Crime: ఏకాంతంగా ప్రేమికులు.. తండ్రి ఎంత పనిచేశాడంటే.?

Exit mobile version