Site icon NTV Telugu

Minister Venu Gopala Krishna: మంత్రి మల్లారెడ్డికి ఏపీ మంత్రి కౌంటర్‌.. ఇక్కడికి వచ్చి చూడండి..!

Minister Venu Gopala Krishn

Minister Venu Gopala Krishn

Minister Venu Gopala Krishna: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ వచ్చి చూడాలని సూచించారు.. పోలవరం ప్రాజెక్టు గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడకపోవడం బెటర్‌ అని హితవుపలికిన ఆయన.. ఏపీలో సామాజిక న్యాయం అమలు అవుతుందన్నారు.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నది వారి నాయకత్వమే అని గుర్తించాలన్నారు.. మరోవైపు.. అశ్వనీదత్ ఎవరి మెప్పు కోసమో మాట్లాడుతున్నట్లు ఉంది.. అంటూ నిర్మాత అశ్వనీదత్‌ కామెంట్లపై కౌంటర్‌ ఎటాక్‌ చేశారు.. సినిమా పరిశ్రమలోని పెద్దలు తెలుగు సినిమాకి ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఏంటి? అంటూ సవాల్‌ చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ..

Read Also: TV Channel: తెలుగు టీవీ ఛానల్‌లో అర్ధరాత్రి అశ్లీల వీడియోలు.. హ్యాక్ చేసి..

కాగా, ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషం విదితమే.. కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఏపీ రాజకీయాలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని మల్లారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ శక్తి ఏంటో అందరికీ తెలుసని అన్నారు. పోలవరం కట్టేది కేసీఆర్ అని చెప్పిన మల్లారెడ్డి.. విశాఖ ఉక్కును కూడా కాపాడతాం అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కేసీఆర్ సీఎం కావాలని మల్లారెడ్డి అన్నారు. కార్మికుల వేతనాలు ఇస్తామని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను తిడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ స్ఫూర్తితో కార్మికులు కాళేశ్వరం, యాదాద్రి, అంబేద్కర్, సచివాలయాన్ని నిర్మించారన్నారు. హైదరాబాద్ లో కార్మికులకు మంచి రోజులు వస్తాయని మల్లారెడ్డి వెల్లడించారు. మరోవైపు.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించలేదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

Exit mobile version