NTV Telugu Site icon

Chelluboina Venugopala Krishna: బుచయ్య చౌదరికి 8 పదులు వచ్చాయి.. దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు..!

Chelluboina

Chelluboina

Chelluboina Venugopala Krishna: బుచయ్య చౌదరికి 8 పదుల వయస్సు వచ్చింది.. కానీ, దిగజారి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. బొమ్మూరులోని వైసీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.. మంత్రి నామినేషన్ కార్యక్రమంలో జక్కంపూడి రాజా.. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ.. భారీ ఎత్తున వైసిపి శ్రేణులు పాల్గొన్నాయి.. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. శాసనసభ సభ్యత్వానికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.. రాజమండ్రి రూరల్ లో రెండు పర్యాయాలు వైసీపీ అధికారంలోకి రాకపోవడానికి సంబంధించిన వైఫల్యలను గుర్తించి.. ముందుకు వెళ్తున్నాను.. ఈసారి రూరల్ లో అధికారం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Anna Rambabu: సంక్షేమం కావాలంటే జగనన్నే రావాలి..

రాజమండ్రి రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రవాహానికి తెలుగుదేశం మునిగిపోవడం ఖాయం అన్నారు మంత్రి చెల్లుబోయిన.. ఇక, బుచయ్య చౌదరికి 8 పదులు వచ్చాయి… కొంతమంది దొంగలతో ప్రచారం చేయిస్తున్నారు.. ఆరు పర్యాయాలు గెలిచాడు.. దిగజారి రాజకీయాలు చేస్తున్నాడు అని మండిపడ్డారు.. స్థానిక నాయకులు నన్ను ఆశీర్వదించారు.. మంత్రిగా నాకు ఒక మచ్చ కూడా లేదన్న ఆయన.. కానీ, కావాలని బుచ్చయ్య నాపై బురద జల్లుతున్నాడు అని ఫైర్‌ అయ్యారు. మంత్రి మండలపై బుచ్చయ్య చౌదరికి కులంకారం చూపిస్తున్నాడు… గౌరవం ఇచ్చి పుచ్చు కోవాలి.. ప్రజల కష్టాలు గాలికి వదిలేశారని ఆరోపించారు. మరోవైపు.. రాజమండ్రి రూరల్, సిటీ విషయంలో చంద్రబాబును సీటు ఇవ్వండి అని దుర్గేష్ ని హింసించారు… దుర్గేష్ ని నిడదవోలు పంపడానికి ఎత్తుకు పైఎత్తేశాడు.. కుట్రలు చేశారని విమర్శించారు. రూరల్ లో నాకు మెజారిటీ ప్రజలిచ్చినంత.. ప్రజా హృదయాలు గెలవడానికి ప్రతినిత్యం కష్టపడతామని ప్రకటించారు మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.