Chelluboina Venugopal Krishna: బీసీ చట్టానికి సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేక చట్టాలు అమలు చేస్తే మొదట అది నీ తండ్రి (చంద్రబాబు నాయుడు)పైనే ప్రయోగించాల్సి ఉంటుంది అని సెటైర్లు వేశారు. బీసీలను దూషించిన వ్యక్తి నీ తండ్రి.. బీసీలను ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఇప్పుడు బీసీలు చైతన్యవంతులు అయ్యారు.. కాబట్టే 2019లో మీకు 23 స్థానాలు ఇచ్చారు.. ఇప్పుడు మూడు మాత్రమే మిగులుస్తారేమో అని ఎద్దేవా చేశారు.
Read Also: Aamir Khan Daughter Wedding : గ్రాండ్ గా అమీర్ ఖాన్ కూతురి పెళ్లి..
ఇక, బీసీ యువత నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావడం 2004లో వైయస్సార్ హయాం నుంచి ప్రారంభమైందన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.. ఫీజు రియంబర్స్మెంట్ బీసీలకు అమలు చేసిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు.. మరోవైపు.. ఒక పీకే (పవన్ కల్యాణ్) సరిపోలేదనుకుని ఇప్పుడు మరో పీకే (ప్రశాంత్ కిషోర్)ను తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంది.. ఇద్దరు పీకేల మధ్యన లోకేష్ దూరాడు అంటూ సెటైర్లు వేశారు. అయితే, ఎంతమంది వచ్చినా.. ఎందరు పీకేలు వచ్చినా.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరు.. 2024లో సైతం వైఎస్ జగన్ హవా మాత్రమే నడుస్తుంది.. మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.