NTV Telugu Site icon

Chelluboina Venu: రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నాం..

Minister Venu

Minister Venu

కులగణనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఏన్టీవీతో మాట్లాడుతూ.. ఇంతకీ పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలన్నారు. అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ కులగణనపై వ్యాఖ్యలు చేసారు.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీహార్ లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది.. రాష్ట్రంలో పౌరులు ఏవిధంగా జీవిస్తున్నారు.. వారి అవసరాలపై కులగణన జరుగుతుంది.. సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది అని మంత్రి వేణుగోపాల్ కృష్ణ ప్రశ్నించారు.

Read Also: Ola E-Bike Service: కిలోమీటరుకు రూ. 5 మాత్రమే చార్జీ.. ఓలా కీలక ప్రకటన

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కులగణనతో భయపడుతున్నారని మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఎద్దేవా చేశారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదు.. ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాం.. సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలో కులగణన చేపట్టాం అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 67 శాతం కులగణన పూర్తైంది.. 1,26,000/- కుటుంబాలను నేరుగా చూశాం.. 2 కోట్ల జనాభాతో మాట్లాడాం.. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారు అని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.

Read Also: Minister Amarnath: మేం దేనికైనా సిద్దం.. కలిసి‌ వస్తున్న పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దం..

చంద్రబాబు జనసైనికులను మోసం చేయడానికే టికెట్లు ముందు‌ ప్రకటించారు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?.. రేపొద్దున చంద్రబాబు 150 అంటే పవన్ కళ్యాణ్ 150 అనగలడా? అని ఆయన ప్రశ్నించారు. 15 లేదా 20 సీట్లలో పవన్ కళ్యాణ్ దిగజారి పోటీ చేస్తారు, తప్పా అంతకు మించి ఏమీ లేదు.. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు.. తప్పితే ప్రజలపై చిత్తశుద్ధి లేదు అని మంత్రి వేణుగోపాల్ కృష్ణ తెలిపారు.