NTV Telugu Site icon

Buggana Rajendranath: ఏపీ అప్పులపై టీడీపీ అబద్ధాలు చెబుతుంది..

Buggana

Buggana

హైటెక్ సిటీలో టీడీపీ కన్సర్ట్ పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పదే పదే అబద్దాలు చెప్పి వాటిని నిజం చెయ్యాలని అనుకుంటారు.. గచ్చిబౌలి స్టేడియంలో కొందరిని చూశాను.. వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి.. చంద్రబాబు దిగిపోయే నాటికి ఐటీలో మనం 5వ స్థానానికి పడిపోయాం.. చంద్రబాబు కంటే ముందు మన రాష్ట్రం ఐటీలో మూడో స్థానంలో ఉండేది అని ఆయన పేర్కొన్నారు. మరి చంద్రబాబు వల్ల ఐటి పెరిగినట్టా..? తగ్గినట్టా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల విస్తరణ జరగాల్సిన ఐటి దెబ్బతింది.. చంద్రబాబు ఐటి కంపెనీకి కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చాడు అని మంత్రి బుగ్గన మండిపడ్డారు.

Read Also: Samantha: పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా

మాజీ మంత్రి యనమల ప్రతి 15 రోజులకు అప్పుల విషయం మాట్లాడుతున్నారు ఎందుకని మంత్రి బుగ్గన అడిగారు. మాజీ మంత్రి గంటా కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.. టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పును కూడా మాకు అంటగట్టడం అన్యాయం.. 2023 సెప్టెంబర్ వరకూ 4 లక్షల 50 వేల కోట్ల అప్పు ఏపీకి ఉంది.. వైసీపీ వచ్చిన తరువాత చేసిన అప్పుగా చెప్పడం దారుణం అని ఆయన ధ్వజమెత్తారు. కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలను వక్రీకరించడం యనమలకు తగదు.. టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే వృద్ధి రేటు పెరిగింది.. కోవిడ్ పరిస్థితి ఉన్నా వైసీపీ హయాంలో 16.7 శాతం వృద్ధి రేటు పెరిగింది.. వృద్ధి రేటు పెరిగిందంటే ఆదాయం పెరిగినట్లే కదా అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు.

Read Also: Nitish Kumar: “ఇండియా కూటమిలో ఊపు లేదు”.. బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు..

యనమల స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదు అని మంత్రి బుగ్గన అన్నారు. పురంధేశ్వరి ఏ ప్రాతిపదికన ఫోరెన్సిక్ ఆడిట్ అడుగుతున్నారు?.. ఆర్థిక అంశాలపై యనమల మా శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.. తాను సమఉజ్జి కాదని భావిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ఆయన లేఖకు సమాధానం ఇచ్చి ఉండక పోవచ్చు.. కొందరు కొత్త వాళ్ళు కూడా ఆర్థిక అంశాలపై మాట్లాడుతున్నారు.. 3.72 లక్షల అప్పు చేశారనీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఇదంతా రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి అని వారు తెలుసుకోవాలన్నారు. యనమల రాసే ప్రతీ లేఖ లోనూ అయన పేర్కొన్న అంశాలు భిన్నంగా ఉంటున్నాయి.. ఆర్థిక శాఖ మంత్రిగా మా శాఖలోని ఆడిట్ చేసిన వాటిని లేదా కాగ్ లెక్కలు అనుసరించి ప్రకటన చేస్తాను అని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Hyderabad: హయత్ నగర్ కుంట్లూర్ గ్రామంలో విషాదం.. మూడేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన బస్సు

టీడీపీ నేతలు అంతా కూర్చుని ఏపీ అప్పు ఎంతో ఒక లెక్క వేసుకుని ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెబుతామని మంత్రి బుగ్గన అన్నారు. ప్రతీ సారి ఓ కొత్త లెక్క చెప్పే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.. రెవెన్యూ రాబడి వైసీపీ హయాం లో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాం లో 6 శాతం మాత్రమే పెరిగింది.. ఏపీ ఆర్థిక అంశాల ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పురంధేశ్వరి డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది అని ఆయన మండిపడ్డారు. ఏ అంశాల పై శ్వేత పత్రం ఇవ్వాలో ఆమెకే స్పష్టత లేదు.. ఎంపీలు కనకమేడల, రఘురామ కృష్ణంరాజులు లేఖలపై లేఖలు రాస్తున్నారు అని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Rinku Singh: ఆకాశమే హద్దుగా చెలరేగిన రింకూ.. కేవలం 33 బంతుల్లోనే..!

ఆర్థిక మంత్రి తప్పుడు లెక్కలు చెబుతారా అని బుగ్గన అన్నారు. టీడీపీ హయాంలోని 40 వేల కోట్ల పెండింగ్ బిల్లుల గురించి ఎందుకు అడగడం లేదు?.. కార్పొరేషన్ అప్పుల్లో 58 వేల కోట్లు టిడిపి హయాంలో చేసినవే.. స్థూల ఉత్పత్తి, వార్షిక వృద్ధి రేటు, రెవెన్యూ రాబడి లాంటివి ఆర్థిక పరిస్థితికి బెస్ అవుతుంది.. సినిమా డైలాగ్ లా నోటికి వచ్చిన అంకె 10 లక్షల కోట్లు అప్పు అని టీడీపీ చెప్పుకొస్తోంది అని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చెప్పుకొచ్చారు.