అనకాపల్లిలో ఏర్పాటు చేసిన తూర్పు కాపు వన సమారాధనలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం వద్ద అనకాపల్లి నియోజకవర్గ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన వన సమారాధన ఫ్యామిలీ పిక్నిక్ లో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పదవులు వస్తుంటాయి పోతుంటాయి బంధాలు బంధుత్వాలు శాశ్వతం అన్నారు.
Read Also: Yanamala: అప్పులపై బహిరంగ చర్చకు సీఎం జగన్ సిద్ధమా?
పదవులు శాశ్వతం కాదని కొందరు వ్యక్తిత్వాలు ఒకోరకంగా ఉంటాయని అటువంటివారిని మనం పట్టించుకోనవసరం లేదని అన్నారు, ఉన్నత స్థానంలో ఉండి మరొకరికి చేయూతని అందివ్వడం ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి చెన్నారావు, తూర్పు కాపు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు తూర్పు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో ఈనెల 29న రోడ్డుపై ల్యాండ్ కానున్న విమానాలు.. కారణం ఏంటంటే..?