NTV Telugu Site icon

Minister Botsa: చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ కలిసి పోటీ చేస్తారు..

Botsa

Botsa

జగన్ పాదయాత్ర సమయంలో మాటిచ్చారు.. ఇప్పుడు నెరవేరుస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడు, బీజేపీ కలిసి పోటీ చేస్తారు.. ఐదు సంతకాలు చేసారు.. అందులో ఒకటి రైతు రుణమాఫీ అన్నారు ఇచ్చారా.. వైస్ రాజశేఖరరెడ్డి ఇచిత విద్యుత్ పై సంతకం చేసి నెరవేర్చారు అని ఆయన తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వార నవరత్నాలను ఇస్తామన్నారు.. ఎన్ని కష్టలు వచ్చినా నేటికీ ఎక్కడా అంతరాయం లేకుండా అమలు చేస్తున్నారు.. నాలుగు రోజులు గా చూస్తున్నాం.. తప్పు చేసి జైలు కి వెళ్తే.. ఓ పుణ్య పురుషుడు గా కొన్ని పత్రికలు చానళ్లు చెబుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read Also: Mopidevi Venkataramana: ప్రతి పేదవాడి జీవితంలో వెలుగు చూడాలనే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారు..

చంద్రబాబు చెప్పు నువ్వు తప్పు చెయ్యలేదా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్ విధించింది.. అధికారం ఇచ్చారని రెచ్చి పోకూడదు.. అందరం ప్రజలకు కస్టోడియన్లు గా మనం ఉండాలి.. అధికారం వచ్చిందని దోపిడీ చేయడం సరికాదు.. చంద్రబాబు వస్తే మళ్లీ మధ్యవర్తులు వస్తారు.. మళ్లీ దోచుకుంటారు.. ఇది చెప్పాలనే మేము ఇక్కడకు వచ్చాం..వైద్య ప్రజలకు అందించాలనే ప్రతి జిల్లాకి ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ( విజయనగరం ) ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారు.. అనేక విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది.. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. నాలుగు నెలలో ఎన్నికలు రాబోతున్నాయి.. ధన వంతులు – పేదావాడికీ.. దొపిడీకీ – నిజాయితీ మధ్య వార్ జరుగుతోంది.. ప్రజలు చాలా గ్రహించాలి.. మళ్లీ టీడీపీ దోపిడీ పార్టీ ని రాకుండా చూడాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.