NTV Telugu Site icon

Botsa Satyanarayana: సీఎం జగన్ని, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు..

Botsa

Botsa

AP Elections 2024: విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో అనేక దుష్ప్రచారాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ తో పాటు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. నేను వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని కూడా ఫేక్ లెటర్ సృష్టించారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కి క్రిడిబులిటి లేదు.. అతని ఎన్నికల వ్యూహాలన్ని మాకు తెలుసు.. అతనికి అంత సీన్ ఉంటే బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఎందుకు పోటీలో లేడు అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే రాజకీయాలు చేయకూడదని ప్రశాంత్ కిషోర్ కి దూరంగా ఉన్నాం.. వైఎస్ జగన్ ను, నన్ను వ్యక్తిగతంగా టార్గె్ చేసి మాట్లాడుతున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు కురిపించారు.

Read Also: Ntr : అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా..

కాగా, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ కలకలం రేపుతుంది. బొత్స లెటర్ హెడ్ పైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాస్తున్నట్లుగా ఆ లేఖను తయారు చేశారని అన్నారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని టీడీపీ పార్టీకి తెలిపింది.