Site icon NTV Telugu

Minister Botsa: ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదు..

Botsa

Botsa

టీచర్స్ డే సందర్భంగా విశాఖపట్నంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులు అని అన్నారు. ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కదనేది సీఎం జగన్ ఆలోచన.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా?.. అని ఆయన ప్రశ్నించారు. 8వ తేదీ నాటికి టీచర్ల ఖాతాలో జీతాలు పడతాయి.. ఈ సారి సాంకేతిక కారణాలతో జరిగిన అలస్యం వల్లే ఈ దుష్ప్రచారం జరుగుతోంది అని మంత్రి బొత్స అన్నారు.

Read Also: Pappu Yadav: శ్రావణ మాసంలో మీరు పోర్న్ చూడలేదా..? మటన్ విందుపై వివాదం..

విద్యా వ్యవస్థలో పాఠశాలల నుంచి సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెరగకుండా చూస్తున్నాం.. విద్యార్థులతో పాటు 20 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లు ఇచ్చాము అని ఆయన పేర్కొన్నారు. విద్య మీద ఖర్చు సంక్షేమం కాదు.. ఈ రాష్ట్ర అభివృద్ధికి పెడుతున్న పెట్టుబడి అని మంత్రి చెప్పు కొచ్చారు. యూనివర్సిటీలో నియామకాలను దిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Read Also: Bigg Boss 7: ఆ ఎక్స్ కంటెస్టెంట్ తో బ్రేకప్.. రతికా రోజ్ కాదు ప్రియా.. ఈమె బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా!

సబ్జెక్ట్ టీచర్ విధానం అమలు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రయత్నం జరుగుతున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.. 10వ తరగతి ఫలితాల్లో ప్రయివేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version