Botsa Satyanaryana: రాష్ట్రం కలిసిపోయే పరిస్థితి వస్తే.. మోస్ట్ వెల్ కమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళ క్రితం జరిగిపోయిన ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై ఆయన మాట్లాడారు. విభజన చట్టం హామీల అమలు కోసం మేం పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు. ఒకవేళ ఏపీ, తెలంగాణ కలిసిపోయే పరిస్థితి వస్తే మోస్ట్ వెల్ కం అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే తప్పేం ఉంది? అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనే మేం కోరుకుంటాం అన్నారు. విభజన చట్టం ప్రకారం, హక్కుల సాధన కోసం మేం పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు.
గత ప్రభుత్వం ఏ విషయంలోనూ ప్రజలకు అండగా నిలవలేదని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయాడన్నారు. చంద్రబాబు మాటలు తప్ప చేతలు లేవన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వ పాలనలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. అవినీతికి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ సాయం జమ చేస్తున్నామని చెప్పారు. బీసీ సభ సాక్షిగా ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని సీఎం వైయస్ జగన్ వివరించారన్నారు. జయహో బీసీ మహాసభ సక్సెస్ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. బీసీల సభ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Also Read
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
Read Also: Gujarat Assembly Polls Results: కాంగ్రెస్‌కు మరోదెబ్బ.. గుజరాత్‌లో ప్రతిపక్ష హోదా కూడా కష్టమే..
ఎవరి గురించి అయినా చులకన భావంతో మాట్లాడటం సరికాదని, చంద్రబాబు మైండ్‌సెట్ మార్చుకోవాలని సూచించారు. అమరావతి అక్రమాలలో ఏ డీఎన్‌ఏ ఉంది…? పేదల భూములు దోచుకోవడంలో ఏ డీఎన్‌ఏ ఉంది..? ఇప్పుడు బీసీలు టీడీపీ డీఎన్‌ఏ అని ఎలా అంటారు..? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.. రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం. ఉమ్మడి రాష్ట్రంగా కలిసిపోవాలనుకుంటే మోస్ట్ వెల్‌కం.. అందుకు మేము ఎప్పుడైనా సిద్ధమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Read Also:Cyclone Mandous: మాండస్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడు, ఏపీలో అతిభారీ వర్షాలు!
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!