NTV Telugu Site icon

Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ.. మే 1 నుంచి వరుసగా జీవోలు..!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉద్యోగ సంఘాల నాయకులతో ఇన్ ఫార్మల్ మీటింగ్ జరిగింది.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పెండింగ్ నిధులు వంటి అంశాలపై చర్చించాం.. అన్ని అంశాలకు టైం బాండ్ పెట్టాం.. ఇక, మే ఒకటివ తేదీ నుంచి వరుసగా జీవోలు జారీ అవుతాయని వెల్లడించారు.. పీఆర్సీ కమిటీని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.. ఓపీఎస్ పై అడిగారు.. తర్వాతి సమావేశంలో చర్చిద్దాం అని చెప్పామన్న ఆయన.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్చకు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా ఈ అంశం పై సానుకూలంగా ఉన్నారని తెలిపారు.. త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read Also: Samantha: ఇన్ని వేరియేషన్స్ సినిమాలో కూడా చూపించి ఉండదు…

ఇక, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. సమావేశం చాలా ఫలవంతంగా జరిగిందన్నారు.. మార్చి నెలలో హామీ ప్రకారం ఈ నెలాఖరు లోగా ప్రభుత్వం 3 వేల కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం అని చెప్పారన్నారు.. చెప్పిన దాని కంటే ప్రభుత్వం ఎక్కువే చెల్లించింది.. మొత్తం 5,820 కోట్లు చెల్లించారు.. సీపీఎస్ 2443 కోట్లు.. టీఏ, డీఏలు 239 కోట్లు .. పెండింగ్ ఈఎల్స్ 1600 కోట్లు .. జీపీఎఫ్ 2110 కోట్లు .. గ్రాట్యుటీ 289 కోట్లు .. మెడికల్ రీయింబర్స్మెంట్ 69 కోట్లు .. ఈఎల్ ఎన్ క్యాష్ మెంట్ 118 కోట్లుగా ఉందని వెల్లడించారు.. పెండింగ్ డీఏ ఒకటి ఈ నెలలో ఇస్తాం అని చెప్పారన్న ఆయన.. త్వరలో జీవో జారీ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2004 కు ముందు సెలెక్ట్ అయి తర్వాత జాయిన్ అయిన వారిని ఓపీఎస్ కిందకు తీసుకుని వస్తాం అని హామీ ఇచ్చారని తెలిపారు.. మంత్రి మండలి సమావేశంలో ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారన్నారు.. 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని అడిగాం.. మంత్రి వర్గ ఉప సంఘం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి.

Show comments