Site icon NTV Telugu

AP Education System: గతంలో విద్య అంటే కేరళ, ఢిల్లీ.. ఇప్పుడు ఏపీవైపు చూస్తున్నారు..!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

AP Education System: గతంలో విద్య అంటే కేరళ, ఢిల్లీ వైపే చూసేవారు.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉత్తమ మార్కులు తెచ్చుకున్న వారిని మిగిలిన విద్యార్థుల మధ్య ఉంచితే వారు స్ఫూర్తిని నింపగలరన్న ఉద్దేశంతో ఆణిముత్యాలు కార్యక్రమం పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న ముఫ్పై రెండు మంది విద్యార్థులను సత్కరించడం జరుగుతోందన్న ఆయన.. మిగిలిన వారూ పోటీ పడాలనిపించే విధంగా.. ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అలాగే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కూడా సత్కారిస్తున్నాం.. డబ్బుకాదు ముఖ్యం.. ఇది విద్యార్థుల ఉన్నతి కాక్షించడానికని గమనించాలని.. వీరిని స్పూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్లు పోటీ పడాలని.. ప్రతి ఒక్కరూ ఇలాగే సత్కారాలు పొందాలని ఆశిస్తున్నానని తెలిపారు.

Read Also: CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు ఎత్తేయండి.. డీజీపీకి కేసీఆర్ ఆదేశాలు

మధ్యాహ్నం భోజన‌ పథకం గతంలో తూతూ మంత్రంగానే సాగేది.. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు మంత్రి బొత్స.. ఇక, పోటీ పరీక్షల్లో అందరికంటే దీటుగా ఉండాలనే బైజ్యూస్ తో టైయప్ చేసి ఇంగ్లీషు మీడియం విద్యని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.. స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసి విద్యను అందించాలని నిర్ణయించాం.. గతంలో విద్య అంటే కేరళ, ఢిల్లీల వైపే చూసేవారు.. కానీ, ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version