Site icon NTV Telugu

Botsa Satyanarayana: పథకాలు కొనసాగాలంటే వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిందే..

Botsa

Botsa

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవల్సిందే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. అక్కడ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చూడాల్సిందే.. ఇక్కడ మేం ఎమ్మెల్యేగా గెలవాల్సిందే అన్నారు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి శాసనసభ వైసీపీ అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ ని గెలిపించుకోవల్సిన బాధ్యత మీదే అన్నారు.. గరివిడి మండలం దువ్వాం గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. దేవాడ గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హత కలిగిన అందరికీ అందుతున్నాయి.. ఈ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవల్సిందే.. అక్కడ సీఎంగా జగన్ ను చూడాల్సిందే.. ఇక్కడ మేం గెలవాల్సిందే అని వ్యాఖ్యానించారు.. జగన్‌ పోవాలంటూ రకరకాల శాపనార్థాలు పెడుతున్నారు.. జగన్ పాలన పోవాలని అంటున్నారు. కానీ, అది జరగడానికి వీలు లేదన్నారు. సీఎంగా జగన్‌ ఉండాల్సిందే.. జగన్‌ను సీఎంగా ఉండాలంటే.. మేం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాల్సిందే అన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ.

Read Also: TDP-Janasena-BJP Alliance: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు..! నేడు సస్పెన్స్‌కు తెర

Exit mobile version