Site icon NTV Telugu

Botsa Satyanarayana: చంద్రబాబులాగా మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యం..

Botsa Satyanaryana

Botsa Satyanaryana

Botsa Satyanarayana: వైసీపీ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ పార్లమెంట్‌కు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. ఈ రోజు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారని తెలిపారు. మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని సీఎం జగన్‌ చెప్పారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలుపరిచి మళ్ళీ మీ ముందుకు వచ్చామన్నారు. చంద్రబాబు లాగా మాయ, మోసం, దగా లేకుండా హామీలు నెరవేర్చామని మంత్రి అన్నారు. ఆయనలాగా మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యమన్నారు. నిజాయితీగా, నిక్కచ్చిగా పథకాలు అమలు చేశామని.. రూ.2,70,000 కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అందించామన్నారు.

Read Also: CM YS Jagan: సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే..

విద్యా, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం మీద పెట్టిన ఫోకస్ పెట్టామని.. మళ్లీ ఐదేళ్లు అధికారంలోకి మళ్లీ వాటిపైనే ఫోకస్ చెయ్యబోతున్నామన్నారు. మేనిఫెస్టో లో 99 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని.. దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మ్యానిఫెస్టోని అమలు చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదీ సీఎం జగన్ కమిట్ మెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారన్నారు. విశాఖను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ కల అని ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోనే రిఫరెండంగా తీసుకుంటున్నామన్నారు. రూ. 25 వేల లోపు జీతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్నాలు అందించడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. ఇది చాలా మంచి నిర్ణయమంటూ.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు వైసీపీ మేనిఫెస్టోపై పార్టీ ఎంపీ విజయసారెడ్డి కూడా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోందన్నారు. 2019లో ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేశామని.. ఈసారి కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. పెన్షన్లు, చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తం లాంటి పథకాలను మరింత మెరుగు పరిచారన్నారు. ఓబీసీ నేస్తం పథకాన్ని లక్షా 20 వేలకు పెంచారని.. అన్ని అంశాలనూ మేనిఫెస్టోలో పొందుపరిచారని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

 

Exit mobile version