NTV Telugu Site icon

Minister Atchannaidu: వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: రాష్ట్రం వెంటిలేషన్ మీద ఉందని.. నేడు వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసుకునే పొజిషన్‌కు వచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తారు కానీ.. ఈ రాష్ర్టానికి అప్పులు ఉన్నాయని చెబితే వినే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం అదృష్టమన్నారు. క్లిష్ట సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు కాకుండా ఇంకా ఎవరిని సీఎం సీట్లో కుర్చో పెట్టినా దండం పెట్టి పారిపోతారన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ శాఖలో కూడా డబ్బులు లేవని.. ఎవరికి ఏది ఇద్దామన్నా సిల్లిగవ్వలేదన్నారు. కోట్ల రూపాయల బకాయిలు, 12 లక్షల కోట్లు అప్పుందన్నారు.

Read Also: Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం

శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు.. జగన్ సర్కారు వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ముగ్గురు పిల్లలు కన్నవారికి ప్యాకేజీ‌ ఇస్తామని.. పిల్లల్ని కనండి ఏం ఇబ్బంది లేదని మంత్రి ప్రజలకు సూచించారు. పాఠశాలలు ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం జనాభా తగ్గిపోతుందని, ఇది ప్రమాదమన్నారు. చైనా ‌కూడా అదే గగ్గోలు పెడుతోందన్నారు. చంద్రబాబు జనాభాపై చర్చించమన్నారని మంత్రి స్పష్టం చేశారు.