Site icon NTV Telugu

Pension In AP : జులై 1 న పెంచిన పెన్షన్ లు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Pension

Pension

Pension In AP : నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ) మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారు. అలాగే మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున ఇస్తామని ఆయన అన్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులే ఇంటిటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.

Kalki 2898 AD : కల్కికి రేణు దేశాయ్ రివ్యూ.. అరచీ అరచీ నా గొంతు పోయింది!

ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని., గతంలో రూ.2,700 కోట్ల నిధులను పెన్షన్ ల కోసం వెచ్చిస్తుండగా.. ఇప్పుడు రూ. 4,400 కోట్ల మేర పెన్షన్ లను ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్టిఆర్ భరోసా పేరుతో పెన్షన్లను పంపిణీ చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. అర్హులందరికీ పెన్షన్ లు అందేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Anant Ambani Wedding: స్టార్ హీరోల ఇంటికి అనంత్‌ అంబానీ.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక ఆహ్వానం!

Exit mobile version