NTV Telugu Site icon

Ambati Rambabu: జనసేన ఎందుకు పెట్టారో పవన్‌ కే తెలీదు

Ambati Challenges Pawan

Ambati Challenges Pawan

గుంటూరు జిల్లా వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విరివిగా పాల్గొంటున్నారు. పల్నాడు జిల్లాలో మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ జగనన్నే మా భవిష్యత్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. తమ ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం చేకూరిన వారి నుంచి వివరాలు, ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. పనిలో పనిగా విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతుంటే..ప్రతిపక్షాలు కువిమర్శలు చేస్తున్నాయని మండిపడుతున్నారు.

Read Also:Sachin Pilot Vs Ashok Gehlot: రాజస్థాన్ కాంగ్రెస్ లో పోరు.. నిరాహారదీక్షకు దిగిన సచిన్ పైలట్

అంబటి రాంబాబు జనసేన పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కళ్యాణ్ కే తెలియదన్నారు మంత్రి అంబటి రాంబాబు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనసేన పార్టీ పెట్టావా లేక చంద్రబాబు పల్లకి మో పార్టీ పెట్టాడా పవన్ సమాధానం చెప్పాలన్నారు. ఒంటరిగా పోటీ చేయలేని పార్టీలకు ఈ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలన్నారు. మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి లేదంటే నన్ను ఆశీర్వదించవద్దు అని సూటిగా,దైర్యంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు అంబటి రాంబాబు. జగన్ పై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా , ఎవరు ఎంత మందితో కలిసి వచ్చిన ప్రజలు చితకొట్టి పంపిస్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ని మళ్ళీ మెజారిటీతో గెలిపిస్తారన్నారు.

Read Also: Bandi sanjay: టెన్త్‌ పేపర్‌ లీక్‌.. నేడు హైకోర్టులో బండి సంజయ్ రిమాండ్ రద్దుపై విచారణ